Social 1080×1350 • Multi-page
06-06-2026 BREAKING NEWS 07:46 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జమ్మికుంట మున్సిపల్ సర్వసభ్య సమావేశం: 5 కీలక అంశాలకు పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదం

జమ్మికుంట మున్సిపల్ సర్వసభ్య సమావేశం: 5 కీలక అంశాలకు పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదం
IMG-20260606-WA0008

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 06: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో శనివారం నాడు నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో అత్యంత ప్రాధాన్యతతో కూడిన వాతావరణంలో జరిగింది. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా సాగిన ఈ సమావేశంలో స్థానిక కౌన్సిలర్లు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ క్రమంలో పట్టణ ప్రగతి కోసం ప్రవేశపెట్టిన ఐదు ముఖ్యమైన తీర్మాన అంశాలను మున్సిపల్ పాలకవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ సమావేశంలో ప్రధానంగా పట్టణంలోని తాగునీటి సరఫరా మెరుగుదల, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన ముందస్తు రక్షణ చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే డ్రైన్ల పూడికతీత, పారిశుధ్య పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ముంతాజ్ అలీ (జావిద్), మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ వికాస్, జేఏవో రాజశేఖర్ రెడ్డి, టీపీఎస్ రాజ్‌కుమార్, ఆర్‌ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ ఐ. రమేష్‌తో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.