Social 1080×1350 • Multi-page
10-06-2026 BREAKING NEWS 02:00 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి సీపీఐ యత్నం: బారికేడ్లను నెట్టేసిన కార్యకర్తలు.. పోలీసులతో తోపులాట, ఉద్రిక్తత

ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి సీపీఐ యత్నం: బారికేడ్లను నెట్టేసిన కార్యకర్తలు.. పోలీసులతో తోపులాట, ఉద్రిక్తత
IMG_20260610_135435

ఖమ్మం,వి90 న్యూస్,జూన్ 10 : జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ నాయకులు, పోలీసుల మధ్య భారీ తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేశంలో రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న ఇంధన, నిత్యవసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా సీపీఐ శ్రేణులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.

అయితే, నిరసనకారులు ఒక్కసారిగా కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ కార్యకర్తలు పోలీసుల బారికేడ్లను దాటుకుంటూ కలెక్టరేట్ ప్రధాన గేటు ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను బలవంతంగా వెనక్కి నెట్టివేయడంతో ఇరువర్గాల మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల కంచెను దాటి లోపలికి వెళ్లేందుకు సీపీఐ శ్రేణులు, వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించడంతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు కాసేపు రణరంగంగా మారాయి.