Social 1080×1350 • Multi-page
11-06-2026 BREAKING NEWS 07:09 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఘన సత్కారం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఘన సత్కారం
1005758884

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 11: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జమ్మికుంట పట్టణానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి మున్సిపల్ చైర్మన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి మున్సిపల్ చైర్మన్ ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. ఈ మర్యాదపూర్వక సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు , ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.