Social 1080×1350 • Multi-page
11-06-2026 BREAKING NEWS 08:28 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జమ్మికుంటలో రేపు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు: విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపు

జమ్మికుంటలో రేపు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు: విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపు
IMG_20260611_202615

కరీంనగర్/జమ్మికుంట వి90 న్యూస్ జూన్ 11: హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు (శుక్రవారం) జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎంపీఆర్ (MPR) గార్డెన్‌లో ప్రతిష్టాత్మకమైన ఎస్ఐఆర్ (SIR), పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు సమావేశం నిర్వహించనున్నారు. ఈ భారీ సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, తాటిపర్తి జీవన్ రెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఈ సదస్సుకు సంబంధించిన వివరాలను హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెల్లడిస్తూ నియోజకవర్గంలోని 107 గ్రామాలు, అలాగే హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల 60 వార్డులకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువకులు , కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, రేపు జరగబోయే ఈ అవగాహన సదస్సు సమావేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు.