Social 1080×1350 • Multi-page
16-06-2026 BREAKING NEWS 08:15 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి: ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి: ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు
IMG-20260616-WA0021

ఆంధ్రప్రదేశ్/విజయవాడ,వి90 న్యూస్,జూన్ 16: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం దర్శించుకున్నారు. కేంద్రమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న కేంద్రమంత్రికి, ఇతర ప్రముఖులకు దుర్గగుడి పాలకమండలి చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో శీనానాయక్ , అర్చకులు పూర్ణకుంభంతో, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు దుర్గమ్మ శేషవస్త్రం, లడ్డు ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి గౌరవించారు.