Social 1080×1350 • Multi-page
17-06-2026 BREAKING NEWS 07:03 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జమ్మికుంట మండలంలో ఫోటో స్టూడియోల బంద్ జయప్రదం: రేపటి నుండి నూతన ధరల అమలు

జమ్మికుంట మండలంలో ఫోటో స్టూడియోల బంద్ జయప్రదం: రేపటి నుండి నూతన ధరల అమలు
IMG-20260617-WA0023

కరీంనగర్/జమ్మికుంట, వి90 న్యూస్,జూన్ 17: జమ్మికుంట మండలంలోని ఫోటో స్టూడియోల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ఐకమత్యాన్ని, సహాయ సహకారాలను అందరూ కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.ప్రస్తుతం మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు, ప్రింటింగ్ ఖర్చులు , స్టూడియో సంబంధిత వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ముస్తఫా వివరించారు. పెరిగిన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఫోటో స్టూడియోల సేవల ధరలను స్వల్పంగా సవరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నూతన ధరలు రేపటి (జూన్ 18) నుండి మండలంలోని అన్ని స్టూడియోలలో అమలులోకి వస్తాయని పేర్కొంటూ, వినియోగదారులందరూ ఈ మార్పుకు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నింటి నాగేందర్, జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు యండి. అజార్, ప్రధాన కార్యదర్శి దొడ్డె ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు పొనగంటి విజయ్రాజులతో పాటు ఫోటోగ్రాఫర్లు రత్నకుమార్, రాంబాబు, రవి, సునీల్, ఉపేందర్, తోట రాజేందర్, గౌతం, నాని, శ్రీను, ప్రవీణ్, అంబాల హరీష్, సురోజు శ్రీనాథ్, మడుపు సంతోష్, జానీ, ప్రేమ్ రాజ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.