Social 1080×1350 • Multi-page
17-06-2026 BREAKING NEWS 08:22 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

షూటింగ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతక విజేత ఈషా సింగ్‌ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

షూటింగ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతక విజేత ఈషా సింగ్‌ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
FB_IMG_1781707706320

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 17:మ్యూనిచ్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ షూటింగ్ వరల్డ్ కప్ 2026 పోటీల్లో స్వర్ణ పతకం సాధించి, ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్న ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCRHRD) సంస్థలో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈషా సింగ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, ఆమె సాధించిన అద్భుత విజయానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణతో పాటు భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఈషా సింగ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరిన్ని పతకాలు సాధించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.