Social 1080×1350 • Multi-page
23-06-2026 BREAKING NEWS 08:53 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20260623-WA0028

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 23: హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సేవే లక్ష్యంగా పాలన సాగుతోంది. ఇందులో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాల్లో పర్యటించారు. ఆయా మండలాల్లోని ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) లబ్ధిదారుల ఇండ్లకు ఆయనే స్వయంగా వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు.
ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే కాకుండా, అవసరమైన సమయంలో ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి గడప వద్దకే చేర్చడం ద్వారా ప్రజా సేవ పట్ల తనకున్న నిబద్ధతను ఎమ్మెల్యే మరోసారి చాటుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి భరోసాగా ఉంటూ, ప్రతి సమస్యకు అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. “ప్రజల నమ్మకమే బలం… ప్రజల సేవే ధ్యేయం… సంక్షేమమే లక్ష్యం” అనే నినాదంతో ప్రజా క్షేత్రంలో కౌశిక్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు.