Social 1080×1350 • Multi-page
25-06-2026 BREAKING NEWS 09:44 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 7 లక్షలు దాటింది: దేవాదాయ అధికారుల సమక్షంలో లెక్కింపు

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 7 లక్షలు దాటింది: దేవాదాయ అధికారుల సమక్షంలో లెక్కింపు
IMG-20260625-WA0070

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,జూన్ 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, పారదర్శకంగా నిర్వహించారు. గత 78 రోజులకు గాను భక్తులు స్వామివారికి మొక్కుబడిగా సమర్పించిన కానుకలను లెక్కించగా, హుండీ ద్వారా మొత్తం 7,06,934 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దేవాదాయ శాఖ పరిశీలకులు పి. సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషము వంశీధరాచార్యులు, మడికొండ నవీన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి లెక్కింపును ప్రారంభించగా, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి (ఈఓ) కందుల సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది, భక్తులు హుండీలోని నగదును క్రమపద్ధతిలో లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు పలువురు భక్తులు కూడా పాల్గొని సేవలందించారు.