Social 1080×1350 • Multi-page
26-06-2026 BREAKING NEWS 08:43 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

పోలింగ్ స్టేషన్‌ను సందర్శించిన హుజురాబాద్ ఆర్డీఓ జలకుమారి

పోలింగ్ స్టేషన్‌ను సందర్శించిన హుజురాబాద్ ఆర్డీఓ జలకుమారి
IMG-20260626-WA0028

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 26: హుజురాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలో ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) శ్రీమతి జలకుమారి స్థానిక పోలింగ్ స్టేషన్ నంబర్ 177ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలని, ఎలాంటి తప్పులు లేకుండా జాబితాను సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.ఈ సందర్శనలో ఆర్డీఓ వెంట గిర్దావర్ గడ్డం శంకర్, జీపీఓ శ్రవణ్, బీఎల్ఓ అఖిలాండం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు స్థానిక ఓటర్లను కలిసి, ఓటర్ల సవరణకు సంబంధించిన ఎలిమినేటర్ ఫారాలను (ఫారమ్స్) వారికి స్వయంగా అందజేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల కోసం ఈ ఫారాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు.