Social 1080×1350 • Multi-page
29-06-2026 BREAKING NEWS 08:20 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జమ్మికుంట నూతన ఎంఆర్ఓ సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

జమ్మికుంట నూతన ఎంఆర్ఓ సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్
1005934762

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 29: జమ్మికుంట మండల నూతన తహశీల్దార్ (ఎంఆర్ఓ) గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎంఆర్ఓకు ఆయన శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు. పట్టణాభివృద్ధి, ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారంలో మున్సిపాలిటీ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలుపుతూ, ఆయనకు నూతన పదవీ బాధ్యతలపై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో ప్రముఖులు కొలకని రాజు, పోలు బిక్షపతి, పోల్నేని వేణుగోపాల్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.