Social 1080×1350 • Multi-page
08-07-2026 BREAKING NEWS 09:10 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా వేముల రమ్య నియామకం

తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా వేముల రమ్య నియామకం
IMG-20260708-WA0046

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 08: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రానికి చెందిన వేముల రమ్య నియమితులయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశంలో చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రమ్య సమర్థవంతంగా పనిచేస్తారనే నమ్మకంతోనే ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఈ సందర్భంగా వీర మోహన్ పేర్కొన్నారు.తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్‌, రాష్ట్ర కోశాధికారి జెల్ల రఘు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్‌లకు వేముల రమ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు, మహిళా చేనేత కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. అలాగే సంస్థను బలోపేతం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా మహిళా విభాగాన్ని మరింత విస్తరింపజేసేందుకు శ్రమిస్తానని రమ్య ధీమా వ్యక్తం చేశారు.