Social 1080×1350 • Multi-page
11-07-2026 BREAKING NEWS 08:55 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భుజ శస్త్రచికిత్స విజయవంతం: జనసేన వెల్లడి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భుజ శస్త్రచికిత్స విజయవంతం: జనసేన వెల్లడి
IMG-20260711-WA0033

ఆంధ్రప్రదేశ్,అమరావతి,వి90 న్యూస్,జూలై 11: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో జరిగిన కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన, వైద్యుల సూచన మేరకు ఈ సర్జరీ చేయించుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని నిపుణులైన వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. దాదాపు మూడున్నర గంటల పాటు అత్యంత నిశితంగా సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు జనసేన పార్టీ అధికారిక ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు.శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్‌ను ఆపరేషన్ థియేటర్ నుండి ప్రత్యేక రికవరీ రూమ్‌కు తరలించారు. ఆపరేషన్ సమయంలో ఇచ్చిన అనస్తీషియా (మత్తు) ప్రభావం నుండి ఆయన క్రమక్రమంగా బయటకు వస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముంబైలోని సదరు ఆసుపత్రి వైద్యుల బృందం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మరికొంత కాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సర్జరీ జరిగిన విషయం తెలుసుకున్న జనసేన శ్రేణులు, కూటమి నాయకులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చెందకుండా, సర్జరీ విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సంరక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం.