Social 1080×1350 • Multi-page
17-07-2026 BREAKING NEWS 10:50 AM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు
IMG-20260717-WA0006

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 17: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు పలు ఇతర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. జిల్లాల ప్రజలు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.