Social 1080×1350 • Multi-page
23-07-2026 BREAKING NEWS 06:16 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

వరంగల్ కలెక్టరేట్ ముట్టడి: ఢిల్లీ లాఠీఛార్జ్‌కు నిరసనగా PDSU ఆందోళన

వరంగల్ కలెక్టరేట్ ముట్టడి: ఢిల్లీ లాఠీఛార్జ్‌కు నిరసనగా PDSU ఆందోళన
IMG_20260723_135445

వరంగల్,వి90 న్యూస్,జూలై 23: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని PDSU విద్యార్థి సంఘం నాయకుడు మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిజెపి పాలనలో ఇప్పటివరకు 84 సార్లు వివిధ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై దారుణంగా లాఠీఛార్జ్ చేయడం తీవ్ర ఖండనీయమని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడాన్ని స్వస్తి పలకాలని హెచ్చరించారు. కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ ఆందోళనతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.