Social 1080×1350 • Multi-page
23-07-2026 BREAKING NEWS 08:15 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఇందల్వాయి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా భైరి రవి నియామకం

ఇందల్వాయి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా భైరి రవి నియామకం
IMG-20260723-WA0096

నిజామాబాద్,వి90 న్యూస్,జూలై 23: ఇందల్వాయి నూతన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా భైరి రవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భైరి రవి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా, గ్రామ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి సరైన దిశానిర్దేశం లభిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు , గ్రామ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు భైరి రవి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో పార్టీని ముందుకు తీసుకెళ్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.