Social 1080×1350 • Multi-page
24-07-2026 BREAKING NEWS 09:42 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

పెద్దంపల్లి ఊర చెరువు వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఆరుగురి అరెస్ట్

పెద్దంపల్లి ఊర చెరువు వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఆరుగురి అరెస్ట్
100621077

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 24: జమ్మికుంట మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామ శివారులో గల ఊర చెరువు వద్ద రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై జమ్మికుంట పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 3,960 నగదుతో పాటు, ఐదు ద్విచక్ర వాహనాలు మరియు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో నిందితులు పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన రాచర్ల సుమన్, లోకిని రాజ కొమురయ్య, మంతెన రఘుపతి, తునికి ప్రశాంత్, జూపాక రామాచారి, చింత శ్రీనివాస్‌లుగా గుర్తించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వీరిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.