Social 1080×1350 • Multi-page
20-04-2026 BREAKING NEWS 02:26 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థాన నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థాన నూతన పాలకవర్గానికి ఘన సన్మానం
WhatsApp Image 2026-04-20 at 13.45.11

కరీంనగర్ V90న్యూస్, ఏప్రిల్ 20 ; జమ్మికుంట మండల పరిధిలోని ధర్మారంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన చైర్మన్ ఇంగిలే రామారావు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేవస్థాన చైర్మన్ ముద్ధమల్ల రవీందర్ మరియు పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అభివృద్ధి పథంలో ఆలయం:
ఈ సందర్భంగా ఇంగిలే రామారావు మాట్లాడుతూ.. మహిమాన్వితమైన దుబ్బ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని కొనియాడారు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. చైర్మన్ రవీందర్ మరియు పాలకవర్గ సభ్యుల కుటుంబాలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ (AMC) వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నాయకులు శ్రీనివాస్ అశోక్, నెల్లి అశోక్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

#dubbamallanna temple #jammikunta