Social 1080×1350 • Multi-page
01-08-2026 BREAKING NEWS 03:16 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

హనుమకొండలో బీజేవైఎం నిరసన హోరు: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

హనుమకొండలో బీజేవైఎం నిరసన హోరు: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
IMG_20260801_142237

హన్మకొండ,వి90న్యూస్,ఆగస్టు 01: హనుమకొండలోని గవర్నమెంట్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ ఎదుట భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నాయకులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రోడ్డుపై బైఠాయించారు.

ఈ సందర్భంగా బీటెక్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నిప్పు పెట్టిన బీజేవైఎం నాయకులు, ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి దహన యత్నాన్ని అడ్డుకోవడంతో కాలేజీ ప్రాంగణం వద్ద కొంతసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.