Social 1080×1350 • Multi-page
02-08-2026 BREAKING NEWS 06:25 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

భూ వివాదంలో దంపతులపై దాడి: సర్పంచ్‌పై వీణవంక పోలీసులకు ఫిర్యాదు

భూ వివాదంలో దంపతులపై దాడి: సర్పంచ్‌పై వీణవంక పోలీసులకు ఫిర్యాదు
IMG-20260802-WA0024

కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,ఆగస్టు 02: వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలో భూ వివాదం కలకలం రేపింది. శనివారం నాటి సంఘటనలో గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్, రజిత దంపతులపై గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఇటీవల తాము భూమిని దున్నుతున్న క్రమంలో సర్పంచ్ అడ్డుకోవడంతో, బాధితులు ఎస్సైని సంప్రదించి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా నోటీసులు జారీ చేయించారు.అనంతరం కోర్టు ఉత్తర్వులతో పొలం వద్దకు వెళ్లి దున్నుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న సర్పంచ్, శ్రీనివాస్‌పై దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో సర్పంచ్‌ను అడ్డుకునేందుకు వచ్చిన ఆయన భార్య రజితను నెట్టివేయడంతో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు, వైద్య పరీక్షల (MNC) కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.గత కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని ఉద్దేశపూర్వకంగానే సర్పంచ్ అడ్డుకుంటున్నారని, న్యాయపరంగా ముందుకు వెళ్తున్న తమపై ఈ రకంగా దాడి చేయడం అన్యాయమని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. సర్పంచ్ నుండి తమకు ప్రాణరక్షణ కల్పించాలని, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులు తమకు న్యాయం చేయాలని దంపతులు విజ్ఞప్తి చేశారు.