Social 1080×1350 • Multi-page
02-08-2026 BREAKING NEWS 06:34 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఇల్లందకుంటలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రజలకు అండగా ఉంటామని జంపాల రితేష్ వెల్లడి

ఇల్లందకుంటలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రజలకు అండగా ఉంటామని జంపాల రితేష్ వెల్లడి
IMG-20260802-WA0032

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, ఆగస్టు 02: ఇల్లందకుంట మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుల పర్యవేక్షణలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందకుంట మండల ఇంచార్జ్ జంపాల రితేష్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలందరికీ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. మండలంలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు పొన్నం శిరీష, దీటి రమేష్, గుండారపు కిరణ్, అంబాల హరీష్, బండి అశోక్, కొత్తూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.