Social 1080×1350 • Multi-page
06-08-2026 BREAKING NEWS 06:43 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జమ్మికుంటలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

జమ్మికుంటలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
IMG-20260806-WA0030

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 06: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆయన సిద్ధాంతపరమైన మార్గనిర్దేశం చేస్తూ, ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, వికాస్, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఐ. రమేష్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ శ్రీనివాస్, టీపీఎస్ రమేష్, బిల్ కలెక్టర్లతో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.