Social 1080×1350 • Multi-page
06-08-2026 BREAKING NEWS 08:35 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులర్పించిన సీపీ డా. ఎం. రమేష్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులర్పించిన సీపీ డా. ఎం. రమేష్
FB_IMG_1786028449327

హైదరాబాద్/గచ్చిబౌలి,వి90 న్యూస్,ఆగస్టు 06: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఆయనకు అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ (IPS) ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ జీవితాంతం చేసిన కృషి, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు , ప్రజల పట్ల ఆయన చూపిన అంకితభావం అందరికీ ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు, అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ నివాళి కార్యక్రమంలో సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్‌లతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు అంజలి ఘటించారు.