Social 1080×1350 • Multi-page
15-08-2026 BREAKING NEWS 07:24 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ప్రజా సమస్యలపై బీజేపీ సమరశంఖం: ఈ నెల 25న గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 24 గంటల మహా ధర్నా

ప్రజా సమస్యలపై బీజేపీ సమరశంఖం: ఈ నెల 25న గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 24 గంటల మహా ధర్నా
IMG-20260815-WA0104

వరంగల్,వి90 న్యూస్,ఆగస్టు 15: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో నెలకొన్న పలు దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజెపి సమరశంఖం పూరించింది. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీన 24 గంటల మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల బీజేపీ ముఖ్య నాయకులు ప్రకటించారు.వరంగల్ శివనగర్‌లోని గంట రవికుమార్ స్వగృహంలో శనివారం రోజున రెండు జిల్లాల ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో 66 డివిజన్ల వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, మౌలిక వసతుల లేమిపై సుదీర్ఘంగా చర్చించారు.స్థానిక సమస్యల పట్ల మున్సిపల్ అధికారులు, పాలకులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అధికారులలో చలనం తెచ్చేందుకే ఈనెల 25న 24 గంటల భారీ ధర్నాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయంవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.