Social 1080×1350 • Multi-page
17-08-2026 BREAKING NEWS 08:05 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

అనాథ వృద్ధుని మృతి: ఆచూకీ కోసం జమ్మికుంట పోలీసుల విజ్ఞప్తి

అనాథ వృద్ధుని మృతి: ఆచూకీ కోసం జమ్మికుంట పోలీసుల విజ్ఞప్తి
IMG-20260817-WA0025

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 17: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద తీవ్ర అనారోగ్యంతో పడివున్న సుమారు 70 నుండి 75 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తుతెలియని వృద్ధుడిని స్థానికులు గమనించి వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మరణించాడు. మృతునికి సంబంధించిన బంధువులు గానీ, ఆచూకీ తెలిసిన వారు గానీ వెంటనే జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.