Social 1080×1350 • Multi-page
20-08-2026 BREAKING NEWS 08:08 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

యాదాద్రి AIYF రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

యాదాద్రి AIYF రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
IMG-20260820-WA0012

జిల్లా అధ్యక్షుడు పోలోజు రంజిత్ కుమార్ పిలుపు

కరీంనగర్/తిమ్మాపూర్,వి90 న్యూస్,ఆగస్టు 20: ఉద్యోగం యువత హక్కు అని, అది ఎవరి భిక్ష కాదని అఖిలభారత యువజన సమాఖ్య (AIYF) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పోలోజు రంజిత్ కుమార్ పేర్కొన్నారు. తిమ్మాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు చలో యాదాద్రి పేరుతో నిర్వహించనున్న AIYF రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య కరీంనగర్ జిల్లా సమితి ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.