Social 1080×1350 • Multi-page
26-04-2026 BREAKING NEWS 04:25 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

విధుల నిర్వహణలో సిఐ లక్ష్మీనారాయణ సేవలు మరువలేనివి: ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు

విధుల నిర్వహణలో సిఐ లక్ష్మీనారాయణ సేవలు మరువలేనివి: ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు
IMG-20260426-WA0035

కరీంనగర్, ఇల్లందకుంట, ఏప్రిల్ 26(V90 NEWS): జమ్మికుంట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) లక్ష్మీనారాయణ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం జరిగింది. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు సిఐను శాలువాతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని, కళ్యాణ ముత్యాల తలంబ్రాలను బహుకరించారు. సిఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా లక్ష్మీనారాయణ పటిష్టమైన చర్యలు తీసుకున్నారని చైర్మన్ కొనియాడారు. నేరాల నియంత్రణ కోసం అనేక గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఇల్లందకుంట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారని గుర్తు చేశారు.”కర్తవ్య నిర్వహణలో నిబద్ధత కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్న సిఐ లక్ష్మీనారాయణ బదిలీపై వెళ్లడం బాధాకరంగా ఉన్నప్పటికీ, వారు వెళ్లే చోట మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ ఇంగిలే రామారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామారావు. దేవస్థాన ధర్మకర్తలు పరమేష్, కిరణ్, గోపాల్ రెడ్డి , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.