Social 1080×1350 • Multi-page
22-08-2026 BREAKING NEWS 06:17 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ప్రగతి ఫలాలు ప్రతి గడపకూ అందిస్తాం: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్

ప్రగతి ఫలాలు ప్రతి గడపకూ అందిస్తాం: హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్
IMG-20260822-WA0020

కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,ఆగస్టు 22: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వీణవంక మండలంలోని బేతిగల్, వల్భాపూర్, నర్సింగాపూర్, లస్మక్కపల్లి, వీణవంక, రామకృష్ణాపూర్, కొండపాక, హిమ్మత్ నగర్, శ్రీరాములపేట, నర్సింహులపల్లి, చల్లూర్, మామిడాలపల్లి, ఎల్భాక, గంగారం, బొంతుపల్లి, ఘన్ముక్ల, మల్లన్నపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా 19 లక్షల రూపాయల విలువ చేసే 49 ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి నేరుగా అందజేశారు.

ఈ పర్యటనలో భాగంగా గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పుడు పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ ఇంటికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తోందని, ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఆసరాగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. అనంతరం దేశాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, గతంలో విప్ గా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చేయలేని పనులను తాము ఇంచార్జి హోదాలోనే చేసి చూపామని పేర్కొన్నారు. ఇళ్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించడమే కాకుండా లబ్ధిదారులకు పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.అలాగే లస్మక్కపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. తెలంగాణలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటనను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. విద్యాసంస్థల మౌలిక వసతుల పెంపు కోసం సీఎం యత్నిస్తుంటే, ఆ భయంతోనే పర్యటనకు అనుమతి ఇవ్వకుండా రాజకీయం చేశారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.