Social 1080×1350 • Multi-page
24-08-2026 BREAKING NEWS 07:37 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

కోరపల్లి గ్రామంలో అనాథ శవం లభ్యం: మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి

కోరపల్లి గ్రామంలో అనాథ శవం లభ్యం: మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి
IMG_20260824_193629

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 24: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న ఒక పాడుబడిన హోటల్‌లో సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని ముస్లిం వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి గత వారం రోజులుగా గ్రామంలో తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తూ జీవితం గడుపుతున్నాడని, లభ్యమైన ఆహారం తింటూ అదే పాడుబడిన హోటల్‌లో నిద్రించేవాడని స్థానికులు వెల్లడించారు.మృతుడి ఎడమ చేతిపై ‘AU’ అనే అక్షరాల పచ్చబొట్టు (టాటూ) ఉందని పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలు లేదా ఆయన బంధువుల సమాచారం తెలిసిన వారు వెంటనే జమ్మికుంట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.