Social 1080×1350 • Multi-page
29-08-2026 BREAKING NEWS 06:26 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

NEET PG-2026 పరీక్షలకు పటిష్ట బందోబస్తు: వరంగల్ సీపీ శ్వేత

NEET PG-2026 పరీక్షలకు పటిష్ట బందోబస్తు: వరంగల్ సీపీ శ్వేత
IMG-20260829-WA0033

హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 29: కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరగనున్న NEET PG-2026 పరీక్షల కోసం పూర్తిస్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 BNSS అమల్లో ఉంటుందని వెల్లడించారు.ఈ నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడటంపై కఠిన ఆంక్షలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు. అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలతో పాటు మైకులు, డీజేలతో చేసే ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక పోలీస్ పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దించడమే కాకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల సజావు నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.