Social 1080×1350 • Multi-page
30-08-2026 BREAKING NEWS 08:55 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

సామాజిక సేవకురాలు శోభారాణికి అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ ప్రదానం

సామాజిక సేవకురాలు శోభారాణికి అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ ప్రదానం
IMG-20260830-WA0047

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్,ఆగస్టు 30: హుజూరాబాద్‌ రత్న, స్పందన సేవా సంస్థ చైర్మన్ అనుమాండ్ల శోభారాణి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్‌ను అందుకని ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. గడిచిన 20 సంవత్సరాలుగా ఆమె దివ్యాంగుల సంక్షేమం కోసం అందించిన అసమాన సేవలు, మహిళా సాధికారతకు చేసిన కృషి మరియు యువతలో సేవా భావాన్ని పెంపొందించేందుకు చేపట్టిన వివిధ సామాజిక కార్యక్రమాలను గుర్తిస్తూ యునైటెడ్ అమెరికా యూనివర్సిటీ ఈ గౌరవాన్ని ప్రకటించింది. సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆమె సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.పుదుచ్చేరిలోని కంబన్ కలైరంగం ఆడిటోరియంలో తమిళనాడు మాజీ న్యాయమూర్తి డాక్టర్ కే వెంకటేశన్ అధ్యక్షతన నిర్వహించిన ‘సామాజిక నాయకులు, దార్శనికుల సమ్మేళనం-2026’ వేదికగా ఈ పురస్కార ప్రధానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గౌని నరసింహ గౌడ్ , తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.ఆర్. సంపత్ చేతుల మీదుగా శోభారాణి ఈ గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించారు. అంతర్జాతీయ వేదికపై శోభారాణికి ఈ గౌరవం దక్కడం పట్ల హుజూరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక సేవకులు , అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.