జగ్గయ్యపల్లి మత్స్య పారిశ్రామిక సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక: అధ్యక్షుడిగా దుగ్గినాల రవీందర్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 31: జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సంఘం నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా దుగ్గినాల రవీందర్, ఉపాధ్యక్షుడిగా నిమ్మల సంపత్, కోశాధికారిగా నిమ్మల రవీందర్ ఎంపికయ్యారు. అలాగే డైరెక్టర్లు (సభ్యులు)గా దుగ్గినాల సంపత్, దుగ్గినాల కొమురయ్య, నిమ్మల సంపత్, గుడెపు రవి, నిమ్మల సంపత్, సంపత్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా నుండి విచ్చేసిన సంబంధిత అధికారి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంఘం పురోగతికి శాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు రమేష్‌తో పాటు ముదిరాజ్ కుల నాయకులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలియజేశారు.

