Social 1080×1350 • Multi-page
31-08-2026 BREAKING NEWS 08:10 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ప్రతిపక్షాల దుష్ప్రచారాలను నమ్మొద్దు: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

ప్రతిపక్షాల దుష్ప్రచారాలను నమ్మొద్దు: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
IMG-20260831-WA0046

హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 31: హనుమకొండలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ల విమర్శలను తిప్పికొడుతూ, సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు పేల్చడం మానాలని హెచ్చరించారు. మాట్లాడే ముందు తమ గత చరిత్రను గుర్తుచేసుకోవాలని, అరవింద్ తన భాషను మార్చుకోకపోతే వరంగల్‌ వచ్చినప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు 15వ తారీఖున జీతాలు ఇచ్చిన చరిత్ర ఉందన్న ఆయన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతినెల ఒకటో తారీఖునే వేతనాలు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నాలుగేళ్లు పెండింగ్‌లో పెట్టింది గత ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలను చెల్లిస్తూనే కొత్త ఫీజులను విడుదలతో ముందుకు వెళ్తోందని తెలిపారు.వరంగల్ నగరాన్ని గత ప్రభుత్వం విభజించి అభివృద్ధిని దెబ్బతీసిందని విమర్శించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నగరానికి భారీగా నిధులు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ.5,300 కోట్లకు పైగా, వాటర్ వర్క్స్ కోసం రూ.550 కోట్లు, నిజాం కాలం నాటి ఫిల్టర్ బెడ్ స్థానంలో నూతన ఫిల్టర్ బెడ్ నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.300 కోట్లు ఖర్చు చేశామని, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల అభివృద్ధికి నిధులు తెచ్చామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసమే ప్రతిపక్షాలు సీజనల్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ 125 ఏళ్ల త్యాగాల చరిత్ర ఉన్న పార్టీ అని, తనపై , కుటుంబసభ్యులపై అనవసరంగా వ్యక్తిగత నిందలు వేయడం ఆపాలని స్పష్టం చేశారు. వరంగల్ అభివృద్ధిని కాంగ్రెస్ పాలనతో పోల్చి చూడాలని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.