Social 1080×1350 • Multi-page
31-08-2026 BREAKING NEWS 08:17 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

పేదల ఇండ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం నిరసన

పేదల ఇండ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం నిరసన
IMG_20260831_201300

హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 31: హనుమకొండ జిల్లాలో నిరుపేదలకు తక్షణమే ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు స్థానిక ఏకశిలా పార్క్ నుండి కలెక్టరేట్ వరకు పార్టీ శ్రేణులు, బాధిత ప్రజలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. నివాస స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేలాది మంది నిరుపేదలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, వారికి అర్హత ఆధారంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో నానా అవస్థలు పడుతున్న పేదల వేదనను గ్రహించి అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇండ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు.