Social 1080×1350 • Multi-page
01-09-2026 BREAKING NEWS 10:48 AM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల మంజూరుకు: మంత్రి శ్రీధర్ బాబు హామీ

హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల మంజూరుకు: మంత్రి శ్రీధర్ బాబు హామీ
IMG-20260901-WA0008

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్ సెప్టెంబర్ 01: హుజురాబాద్ పురపాలక సంఘ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ నాయకత్వంలో మున్సిపల్ పాలకవర్గం రాష్ట్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు , కో-ఆప్షన్ సభ్యులు పట్టణంలో ఎదురవుతున్న పలు సమస్యలను, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.సమావేశం అనంతరం స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, హుజురాబాద్ మున్సిపాలిటీ పురోగతికి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పట్టణ మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను త్వరలోనే కేటాయిస్తామని హామీ ఇస్తూ, ఈ విషయమై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమం , పట్టణాభివృద్ధి దిశగా కృషి చేస్తున్న మున్సిపల్ పాలకవర్గాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.