Social 1080×1350 • Multi-page
02-09-2026 BREAKING NEWS 07:09 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

అనగోనీ రవీందర్ కుటుంబానికి BRS రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి పరామర్శ

అనగోనీ రవీందర్ కుటుంబానికి BRS రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి పరామర్శ
IMG-20260902-WA0054

కరీంనగర్/వే సైదాపూర్,వి90 న్యూస్, సెప్టెంబర్ 02: సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యులు అనగొని సచిన్ గౌడ్ తండ్రి అనగోనీ రవీందర్ ఇటీవల మరణించగా, వారి నివాసంలో BRS రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి రవీందర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రవీందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వంశీధర్ రెడ్డి, ఆయన మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రవీందర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, చిన్న వయసులోనే ఆయన అనారోగ్యంతో కన్నుమూయడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, బాధిత కుటుంబ సభ్యులకు ఓదార్పునందించారు. ఈ కార్యక్రమంలో వంశీధర్ రెడ్డితో పాటు వలస సుభాష్ చంద్రబోస్, మొలుగూరి హరికృష్ణ, అంజి, మోహన్ రావు, తిరుమలేశ్, అజయ్, కార్తీక్, శ్రీపాల్ గౌడ్, ఐలయ్య, మల్లికార్జున్, ప్రణీత్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.