Social 1080×1350 • Multi-page
03-09-2026 BREAKING NEWS 07:08 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

కౌన్సిలర్ పొనగంటి విష్ణు చేతుల మీదుగా ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ కాపీ అందజేత

కౌన్సిలర్ పొనగంటి విష్ణు చేతుల మీదుగా ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ కాపీ అందజేత
IMG-20260903-WA0038

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 03: జమ్మికుంట పట్టణంలోని 11వ వార్డు పరిధిలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇంటి ప్రొసీడింగ్ కాపీలను వార్డు కౌన్సిలర్ పొనగంటి విష్ణు, మున్సిపల్ చైర్మన్ మోలుగురి ప్రశాంత్ చేతుల మీదుగా ఘనంగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ, తమ ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.