బీసీఐటీలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థినులకు సర్టిఫికెట్ల పంపిణీ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 03: జమ్మికుంటలోని బీసీఐటీ (BCIT) కార్తికేయ ఐటీఐ కళాశాలలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థినులకు శనివారం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. మూడు, ఆరు నెలల పాటు శిక్షణ పొందిన లబ్ధిదారులకు ఈ సర్టిఫికెట్లను అందజేసిన అనంతరం కళాశాల చైర్మన్ లెంకలపెల్లి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థినులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు అందించే ఉపాధి రుణాలు, కుట్టుమిషన్ల పంపిణీ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం బీసీఐటీలో ఉచిత కుట్టుమిషన్ , బ్యూటిషియన్ కోర్సులకు నూతన అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఆసక్తి ఉన్న మహిళలు, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు.

