పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో BRSV ధర్నా: జీవో 97ను రద్దు చేయాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్
హైదరాబాద్/వి90న్యూస్,సెప్టెంబర్ 03: పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాలో BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ BRS ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, MLC దాసోజు శ్రవణ్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే G.O.Ms.No.97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, విద్యార్థులకు BRSV , BRS పార్టీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిధుల కోసం పాలిటెక్నిక్ కాలేజీల 1200 ఎకరాల భూములను బ్యాంకుల వద్ద మార్టిగేజ్ చేసేందుకే ఈ జీవో తీసుకువచ్చిందని ఆరోపించారు.

పాలిటెక్నిక్ వ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, DTE , SBTET పరిధిలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం BRSV నిరంతరం పోరాడుతుందని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో BRS నాయకుడు ముఠా జైసింహా, BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్ చంద్ర, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు నాగేందర్ కొదాటి, రాకేష్, నితీష్, విశాల్, రెహ్మత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

