Social 1080×1350 • Multi-page
04-09-2026 BREAKING NEWS 10:36 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ప్రియురాలికి ఐఫోన్ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్: ఖమ్మం జిల్లాలో ప్రేమ జంట అరెస్ట్

ప్రియురాలికి ఐఫోన్ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్: ఖమ్మం జిల్లాలో ప్రేమ జంట అరెస్ట్
IMG-20260904-WA0035

ఖమ్మం/వైరా,వి90 న్యూస్,సెప్టెంబర్ 04: తన ప్రియురాలికి పుట్టినరోజు కానుకగా ఖరీదైన ఐఫోన్ కొనివ్వాలనే ఉద్దేశంతో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడిన ఒక యువకుడితో పాటు అతని ప్రియురాలిని ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైరా క్రాస్‌రోడ్డు వద్ద గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న మిత్ర చైతన్య(21), హేమలత(20) అనే ప్రేమ జంటను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒడిశాలో కేవలం 16 వేల రూపాయలకు 12 కిలోల గంజాయిని కొనుగోలు చేసిన వీరు, దానిని హైదరాబాద్‌లో ఆరు లక్షల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ప్రయాణిస్తుండగా వైరా వద్ద పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు. విచారణలో తన ప్రియురాలికి ఐఫోన్ బహుమతిగా ఇవ్వడానికే ఈ దందా ఎంచుకున్నట్లు చైతన్య ఒప్పుకున్నాడు. ఈ కేసులో గంజాయి విక్రయించిన భగవాన్ హంతాల్‌తో పాటు, దానిని కొనుగోలు చేయాల్సిన శశి, నాగు అనే వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.