Social 1080×1350 • Multi-page
05-09-2026 BREAKING NEWS 05:53 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

వీణవంకలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

వీణవంకలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు
IMG-20260905-WA0036

హుజూరాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో కండువా కప్పుకున్న కోర్కల్ సర్పంచ్, వార్డు సభ్యులు

కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,సెప్టెంబర్ 05: వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ వైపు చేరికల దూకుడు కొనసాగుతోంది. శనివారం రోజున వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన సర్పంచ్ రమ్యకృష్ణ-అనిల్, వార్డు సభ్యులు, కుల సంఘాల అధ్యక్షులతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది నాయకులు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ప్రణవ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. తమ కడుపు నింపిన కాంగ్రెస్ పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇసుక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు సాండ్ టాక్స్ సదుపాయం కల్పించి జీవనోపాధి అందించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరుతున్నాయని, ఆ అభివృద్ధికి ఆకర్షితులై తాము కాంగ్రెస్‌లో చేరామని వివరించారు. ఇదే క్రమంలో గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలను వొడితల ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారు.

అనంతరం వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న ఈ శుభసందర్భంలో ఇంత భారీ ఎత్తున నాయకులు పార్టీలో చేరడం వారి విశ్వసనీయతకు నిదర్శనమని పేర్కొన్నారు. కోర్కల్ గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, మైనారిటీ నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.