Social 1080×1350 • Multi-page
05-09-2026 BREAKING NEWS 05:58 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ జనరల్ సెక్రటరీగా దొడ్డే శ్రీకాంత్ నియామకం

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ జనరల్ సెక్రటరీగా దొడ్డే శ్రీకాంత్ నియామకం
IMG-20260905-WA0026

ఆర్డర్ కాపీ అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,సెప్టెంబర్ 05: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా దొడ్డే శ్రీకాంత్ నియమితులయ్యారు. టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంకు, రాజకీయంగా ప్రోత్సహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బాబుకు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కు శ్రీకాంత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా దొడ్డే శ్రీకాంత్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్సీల సంక్షేమమే లక్ష్యంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న దళిత సంక్షేమ పథకాలను ప్రతి గ్రామానికి, ప్రతి లబ్ధిదారునికి చేరవేస్తామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని, ఎస్సీ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిజాయితీ, అంకితభావంతో నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు.