Social 1080×1350 • Multi-page
06-09-2026 BREAKING NEWS 06:45 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ముగ్గు పోసిన కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్: కాంగ్రెస్ నిబద్ధతకు నిదర్శనమన్న నాయకులు

ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ముగ్గు పోసిన కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్: కాంగ్రెస్ నిబద్ధతకు నిదర్శనమన్న నాయకులు
IMG-20260906-WA0022

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 06: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు పిట్టల వాడలో ఇటీవల నూతనంగా మంజూరైన ఇళ్లకు స్థానిక కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ శంకుస్థాపన చేసి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా వార్డుకు చెందిన లబ్ధిదారులు బిట్ల స్వప్న, బుర్రి లక్ష్మిలను కౌన్సిలర్ ప్రత్యేకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంలో పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందనడానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరే నిదర్శనమని అన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.త్వరలోనే అర్హులందరికీ నూతన పెన్షన్లను కూడా మంజూరు చేయనున్నట్లు కౌన్సిలర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో తమ నాయకుడు ఒడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు , లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.