జమ్మికుంట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దొగ్గల భాస్కర్ నియామకం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 06: జమ్మికుంట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన దొగ్గల భాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ అధికారిక నియామక లేఖను విడుదల చేశారు. మానకొండూరు శాసనసభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా దొగ్గల భాస్కర్ ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా దొగ్గల భాస్కర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించి, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా సేవలందిస్తున్న తనను గుర్తించి పదవిని కట్టబెట్టడం సంతోషంగా ఉందన్నారు. నాయకుల ఆశయాలు, నమ్మకానికి అనుగుణంగా నడుచుకుంటూ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

