Social 1080×1350 • Multi-page
06-09-2026 BREAKING NEWS 07:43 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా కార్యదర్శిగా అకినపల్లి వెంకటేష్ నియామకం

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా కార్యదర్శిగా అకినపల్లి వెంకటేష్ నియామకం
IMG-20260906-WA0033

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 06: ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అకినపల్లి వెంకటేష్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా అకినపల్లి వెంకటేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకు, నియామకానికి సహకరించిన జిల్లా చైర్మన్ కొరివి అరుణ్ కుమార్ తో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన నియామకానికి మద్దతుగా నిలిచిన ఇల్లందకుంట మండల, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.