Social 1080×1350 • Multi-page
07-09-2026 BREAKING NEWS 11:49 AM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత: నల్ల టీషర్టు విప్పి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నిరసన!

అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత: నల్ల టీషర్టు విప్పి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నిరసన!
IMG-20260907-WA0009

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 07: తెలంగాణ శాసనసభ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిరసనతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, 1000 రోజులు గడిచినా వాటిని నెరవేర్చకపోగా ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్దే అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు , బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల టీషర్టులతో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడికక్కడే తన టీషర్టును విప్పేసి అర్థనగ్నంగా వినూత్న నిరసనకు దిగారు. అయినప్పటికీ పోలీసులు ఆయనను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించకుండా బలవంతంగా పోలీసు వాహనంలో అదుపులోకి తీసుకున్నారు.ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పలేకనే ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని, ఈ అరెస్టులు ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.