Social 1080×1350 • Multi-page
07-09-2026 BREAKING NEWS 06:19 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలకు వొడితల ప్రణవ్ డిమాండ్

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలకు వొడితల ప్రణవ్ డిమాండ్
IMG-20260907-WA0033

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, సెప్టెంబర్ 07: శాసనసభ స్పీకర్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ, ఆ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని, మధుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నత పదవిలో ఉన్న దళిత వర్గానికి చెందిన స్పీకర్ పై సభ వెలుపల బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. గతంలో దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి పదేళ్ల పాటు మోసం చేసిన బిఆర్ఎస్ నాయకులు, నేడు ఒక దళిత బిడ్డ ఉన్నతమైన స్పీకర్ స్థానంలో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా దుర్భాషలాడడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని పేర్కొన్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేసి, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోని బిఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే రీతిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యవస్థను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై ఉపేక్షించేది లేదని, ఆయనపై వెంటనే చట్టరిత్య చర్యలు తీసుకోవాలని ప్రణవ్ స్పష్టం చేశారు.