వాసవి క్లబ్ వికేఎస్పీ ఆధ్వర్యంలో ఉచిత రక్త నిర్ధారణ శిబిరం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 07: జమ్మికుంట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జయంతి వారోత్సవాల సందర్భంగా వికేఎస్పీ జమ్మికుంట క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రక్త నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. అమ్మ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో తొమ్మిది, పదో తరగతులకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు చేసి సమూహాలను నిర్ధారించారు.ఈ సందర్భంగా వికేఎస్పీ క్లబ్ అధ్యక్షుడు గుండా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ రక్తం గ్రూప్ వివరాలను తెలుసుకోవడం ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లోనూ, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇతరులకు సాయపడటానికి , వ్యక్తిగత అవసరాలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్‌పర్సన్ రమేష్, ఐపీసీ గంప మహేందర్, వాసవి క్లబ్ ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరకొండ సతీష్ బాబు, ఉపాధ్యాయ బృందం, అమ్మ హాస్పిటల్ వైద్య సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.

