Social 1080×1350 • Multi-page
07-09-2026 BREAKING NEWS 08:15 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జమ్మికుంటలో పలు ఆసుపత్రులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

జమ్మికుంటలో పలు ఆసుపత్రులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
IMG-20260907-WA0063

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 07: జమ్మికుంట పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సహచర పిల్లల హాస్పిటల్, మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రులను ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా, స్థానికంగానే ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డాక్టర్ తిరుపతయ్య, డాక్టర్ కార్తీక్ రెడ్డిలకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, గౌరవ కౌన్సిలర్లు, నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.