ప్రతి పదం ప్రజా హితం
శాసనమండలి నుండి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సస్పెండ్: సభ రేపటికి వాయిదా
హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 08: శాసనమండలి సమావేశాలలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు పడింది. సభలో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీలు తాతా మధు , నవీన్‌రెడ్డిలను ఈ శాసనమండలి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.మండల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ప్రభుత్వం సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దానిని ఆమోదించింది. సభను క్రమశిక్షణతో నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం వాతావరణం వేడెక్కడంతో చైర్మన్ శాసనమండలి సమావేశాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

